ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వృథా నీటిని ఒడిసి పట్టేందుకు అధికారుల చర్యలు - అన్నవరం దేవస్థాన వృధా నీటిని ఒడిసి పట్టేందుకు ఆమోదం

అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టేందుకు చైర్మన్ ఐ.వి. రోహిత్, ఈవో త్రీనాథరావులు ఆమోదం తెలిపారు. రూ. 6.12 లక్షలతో బోర్​వెల్​ని రూపొందించనున్నారు.

అన్నవరం దేవస్థాన వృధా నీటిని ఒడిసి పట్టేందుకు ఆమోదం

By

Published : Sep 10, 2019, 3:20 PM IST

అన్నవరం దేవస్థాన వృధా నీటిని ఒడిసి పట్టేందుకు ఆమోదం
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలోని వర్షపు, వృథా నీటిని ఒడిసిపట్టి, భూగర్భ జలాలు వృద్ధి చేసేందుకు రూ. 6.12 లక్షలతో బోర్ వెల్ విధానాన్ని రూపొందిచేందుకు దేవస్థాన చైర్మన్ ఐ.వి. రోహిత్, ఈవో త్రినాథరావులు ఆమోదం తెలిపారు. కేశఖండన శాలలో, స్నానపు గదుల ద్వారా వచ్చే నీటిని శుద్ధి చేయడం, ఘాట్ రోడ్డులో వర్షపు నీటిని భూమిలో ఇంకింప చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా దేవస్థానంలో పలు అభివృద్ధి, టెండర్లకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. దేవస్థానం గోశాలలోని గిత్త దూడలను ఐటీడీఏ ద్వారా వ్యవసాయానికి, పేద రైతులకు ఉచితంగా అందించేందుకు నిర్ణయించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details