తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో లోక కళ్యాణార్ధం ఈ ఏడాది డిసెంబరు 16 నుంచి 25 వరకు కోటి తులసి పత్రి పూజ నిర్వహించాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఛైర్మన్ ఐ.వి. రోహిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు పలు అంశాలపై చర్చించారు. ఉద్యోగులకు కరోనా సమయంలో చెల్లించాల్సిన 50 శాతం జీతాలు, బకాయిల చెల్లింపు, పలు టెండర్లపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సత్యదేవుని వ్రత విశిష్టత, విధానంపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అనువాదించిన హిందీ పుస్తకం, సీడీని దేవస్థానం వెబ్సైట్లో పెట్టడం, పుస్తకాన్ని ముద్రించటంపై కమిషనర్ ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
లోక కళ్యాణం కోసం అన్నవరంలో కోటి తులసి పత్రి పూజ - అన్నవరం తాజా వార్తలు
డిసెంబరు 16 నుంచి 25 వరకు కోటి తులసి పత్రి పూజ నిర్వహించాలని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఛైర్మన్ ఐ.వి. రోహిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు పలు అంశాలపై చర్చించారు.
![లోక కళ్యాణం కోసం అన్నవరంలో కోటి తులసి పత్రి పూజ లోక కళ్యాణం కోసం అన్నవరంలో కోటి తులసి పత్రి పూజ !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8801256-644-8801256-1600096903189.jpg)
లోక కళ్యాణం కోసం అన్నవరంలో కోటి తులసి పత్రి పూజ !