భక్తుల దర్శనాలకు అన్నవరం దేవస్థానం ఏర్పాట్లు
అన్నవరం దేవస్థానంలో సోమవారం నుంచి ప్రయోగాత్మక దర్శనాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10 నుంచి సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఇందులో భాగంగా 8, 9 తేదీల్లో ఉద్యోగులు, స్థానికులకు దర్శన అవకాశం కల్పించి లోపాలను గుర్తించి సరి చేయనున్నారు.
ఈ నెల 10నుంచి తిరుమల మినహా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనికనుగుణంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం నుంచి రెండ్రోజుల పాటు ప్రయోగాత్మక దర్శనాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మార్చి 20 నుంచి భక్తులకు దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతితో ఈ నెల 10 నుంచి సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఇందులో భాగంగా 8, 9 తేదీల్లో ఉద్యోగులు, స్థానికులకు దర్శన అవకాశం కల్పించి లోపాలను గుర్తించి సరి చేయనున్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఆలయంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.