తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నూతన వధూవరులు సందడి చేశారు. సత్యనారాయణ స్వామి సన్నిధిలో, ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. కొత్త జంటలు అన్నవరం వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతమాచరించి.. దర్శనాలు చేసుకున్నారు. అన్లాక్ తర్వాత ఇంత ఎక్కువ మంది పెళ్లిళ్లు జరగటంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది.
నూతన వధూవరులతో సందడిగా మారిన అన్నవరం దేవస్థానం - annavaram temple news
కరోనా తర్వాత.. ఆర్భాటాలకు పోకుండా సాధారణంగా వివాహాలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నూతన వధూవరులతో సందడి వాతావరణం నెలకొంది. స్వామి సన్నిధిలో ఒక్కటైన జంటలు.. దర్శనం చేసుకుని, ఆశీస్సులు పొందారు.
స్వామివారిని దర్శించుకున్న కొత్త జంటలు