తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనాలు శనివారం నుంచి యధావిధిగా ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. దేవస్థానం ఉద్యోగుల్లో చాలా మందికి కరోనా సోకడంతో ఈ నెల 23 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ముందుగా అధికారులు ప్రకటించారు.
అయితే కరోనా వ్యాప్తి చెందకుండా మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకుని, సిబ్బంది విధులు కుదించి భక్తులకు దర్శనాలు కొనసాగించాలని ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనాలు కొనసాగించాలని నిర్ణయించారు. వ్రతాలు, ఇతర ఆర్జిత సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చని ఆయన వివరించారు.