కరోనా వ్వాప్తి దృష్ట్యా ప్రభుత్వం లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్నవరం దేవస్థానంలో స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించబోమని ఈవో త్రినాథరావు ప్రకటించారు. స్వామి వారికి నిత్య కైంకర్యాలు అన్ని ఏకాంతంగా శాస్త్ర ప్రకారం జరుగుతాయని తెలిపారు.
మే 17 వరకు అన్నవరం స్వామివారి దర్శనం నిలిపివేత - ప్రసిద్ధ దేవాలయాలు
కరోనా రోజురోజుకి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ను మే 17 వరకు పొడిగించింది. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్నవరం దేవస్థానంలో స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించబోమని ఈవో త్రినాథరావు తెలిపారు.
మే 17 వరకు అన్నవరం స్వామివారి దర్శనం నిలిపివేత
భక్తులు నేరుగా పూజల్లో పాల్గొనే అవకాశం లేనందున... దేవస్థానం ఆన్లైన్ అకౌంట్కు రుసుము చెల్లిస్తే వారి పేరు మీద పూజలు చేసే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇప్పటికే అనేక మంది ఆన్లైన్ ద్వారా సొమ్ములు చెల్లిస్తున్నారని... వారి పేరుమీద పూజలు చేస్తామని వివరించారు.
ఇదీ చదవండి