తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనాలు ఈ నెల 21న నిలిపివేయనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఆ రోజు సూర్యగ్రహణం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 21న ఉదయం 10.25 గంటల నుంచి 1.54 గంటల వరకు గ్రహణ కాలం. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనాలు, ఆర్జిత సేవలు అన్ని నిలిపివేయనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే దర్శనాలకు ఆలయ అధికారులు అనుమతించనున్నారు.
ఈ నెల 21న అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనాల నిలిపివేత - news on annavaram satyanarayana swamy temple
సూర్యగ్రహణం సందర్భంగా ఈ నెల 21న అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనాలు నిలిపివేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ నెల 21న అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనాలకు అనుమతి లేదన్న ఆలయ అధికారులు