ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేటి నుంచి ఆన్‌లైన్‌లో సత్యదేవుని వ్రతాలు - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

అన్నవరం సత్యదేవుని వ్రతం నేటి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా భక్తులకు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌ ద్వారా దేవస్థానానికి రూ.1,116 రుసుం చెల్లించాలి.

Annavaram Satyanarayanaswami Vratham will be available to devotees online from today.
నేటి నుంచి ఆన్‌లైన్‌లో సత్యదేవుని వ్రతాలు

By

Published : Oct 3, 2020, 7:33 AM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని వ్రతం శనివారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా భక్తులకు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌ ద్వారా దేవస్థానానికి రూ.1,116 రుసుం చెల్లించాలి.

భక్తులు సూచించిన తేదీన.. పూజ ప్రారంభమయ్యే ముందు యూట్యూబ్‌ లింక్‌ పంపిస్తారు. భక్తులు ఎస్‌బీఐ ఖాతా నంబరు 37460007010, ఐఎఫ్‌ఎస్‌సీ: ఎస్‌బీఐఎన్‌0021804 ద్వారా రుసుం చెల్లించాలని అధికారులు సూచించారు. ఇలా చెల్లించిన వివరాలను, భక్తుల గోత్రనామం, చిరునామా, చరవాణి నంబరును 9491249990కు వాట్సాప్‌ ద్వారా పంపాలి.

ఇదీ చదవండి:ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేయటంలో వారు ఫస్ట్

ABOUT THE AUTHOR

...view details