ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నవరం దేవస్థాన కార్తిక మాస ఆదాయం.. రూ.11.19 కోట్లు

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ హుండీని లెక్కించారు. రూ. 11.19 కోట్ల ఆదాయం సమకూరింది. కరోనా వల్ల భక్తుల రాక తగ్గినా ఆదాయం పడిపోలేదని ఆలయ సిబ్బంది తెలిపారు.

temple
అన్నవరం దేవస్థాన హుండీ లెక్కింపు.

By

Published : Dec 22, 2020, 10:35 AM IST

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి కార్తిక మాసంలో వివిధ విభాగాల ద్వారా రూ. 11.19 కోట్లు ఆదాయం సమకూరింది. కరోనా నేపథ్యంలో గత ఏడాదితో పోల్చితే భక్తుల రాక, వ్రతాల సంఖ్య 50 శాతం మేర తగ్గినా... ఆదాయం ఆశాజనకంగానే సమకూరింది.

వ్రతాల ద్వారా రూ. 3.63 కోట్లు, ప్రసాద విక్రయాలు ద్వారా రూ. 3.21 కోట్లు, హుండీల ద్వారా రూ. 1.86 కోట్లు వచ్చింది. గతేడాది ఇదే సీజన్ లో అన్ని విభాగాల ద్వారా రూ. 16.44 కోట్లు సమకూరిందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details