తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి లెక్కిస్తున్నారు. ఈ నెల 16 వరకు లెక్కింపు జరగనుంది. ఈ ప్రక్రియకు 20 మంది సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నారు.
అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ లెక్కింపు ప్రారంభం
అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ లెక్కింపును ప్రారంభించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని 20 మంది సిబ్బందితోనే ఈ ప్రక్రియ జరుపుతున్నారు. మొదటిరోజు లెక్కింపులో దాదాపు 11 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ లెక్కింపు ప్రారంభం
హుండీలను చివరిగా మార్చి 10న లెక్కించారు. మార్చి 19 నుంచి భక్తుల దర్శనాలు నిలిపివేశారు. మొదటి రోజు లెక్కింపులో రూ. 10.95 లక్షలు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి.. ధవళేశ్వరంలో గోదావరి వరద ప్రణాళికపై సమావేశం