ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నవరంలో ప్రసాదం, దర్శన టిక్కెట్ల ధరలు పెంపు! - అన్నవరం న్యూస్

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రసాదం ధర, పరిమాణం పెంచుతూ దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. ప్రస్తుతం 125 గ్రాముల గోధుమ నూక ప్రసాదం రూ. 15కి విక్రయిస్తున్నారు. ప్యాకెట్ పరిమాణం 150 గ్రాములకు పెంచటంతో పాటు ధర రూ. 20గా నిర్ణయించారు.

annavaram prasadam darsanam rates increse
అన్నవరం దేవస్థానంలో ప్రసాదం, దర్శన టిక్కెట్ ధర పెంచుతూ నిర్ణయం

By

Published : Apr 19, 2021, 10:12 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రసాదం ప్యాకెట్ల ధర, పరిమాణం పెంచుతూ దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానం చేశారు. ఛైర్మన్ రోహిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 125 గ్రాముల గోధుమ నూక ప్రసాదం రూ. 15కి విక్రయిస్తున్నారు. ప్యాకెట్ పరిమాణం 150 గ్రాములకు పెంచటంతో పాటు ధర రూ. 20 గా నిర్ణయించారు.

అలాగే అంతరాలయం ప్రత్యేక దర్శనం టిక్కెట్ ధర రూ. 100 నుంచి రూ. 200కి పెంచారు. అయితే అంతరాలయం ప్రత్యేక దర్శన టికెట్లు పొందిన భక్తులకు 150 గ్రాముల భంగి ప్రసాదం ఉచితంగా అందించడానికి ఆమోదం తెలిపారు. కమిషనర్ అనుమతి అనంతరం కొత్త ధరలు అమలు చేస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details