తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం పి. చామవరం గ్రామంలోని చెరువు వద్ద గల గంగమ్మ తల్లి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పడగొట్టారు. అన్నవరం ఎస్సై రవికుమార్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విగ్రహాల ధ్వంసం సరైన పద్ధతి కాదని ఎస్సై స్థానికులకు చెప్పారు. నియోజకవర్గంలో వరుసగా విగ్రహాలు ధ్వంసం చేయటంపై భాజపా శ్రేణులు నిరసన తెలిపాయి. హిందూ ఆలయాలపై దాడిని పలువురు ఖండించారు.
చెరువు దగ్గర గంగమ్మ తల్లి విగ్రహాన్ని పడేసిన దుండగులు - రౌతులపూడి వార్తలు
తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని పి.చామవరం గ్రామ శివారు విగ్రహం పడి ఉన్న విషయమై శుక్రవారం అన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు..
![చెరువు దగ్గర గంగమ్మ తల్లి విగ్రహాన్ని పడేసిన దుండగులు Annavaram police on Friday registered a case in connection with the fall of a statue in P. Chamavaram village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8942275-177-8942275-1601086583672.jpg)
విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచేందుకు తెస్తున్న గ్రామస్థులు