రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి నూతన ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం నియమించింది. హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ చట్టం 1987 ప్రకారం 16 మందితో కూడిన బోర్డును నియమిస్తూ దేవాదాయశాఖ ఆదేశాలిచ్చింది. వంశ పారంపర్యంగా దేవస్థానం బాధ్యతలు చూస్తున్న ధర్మకర్తల్లో ఒకరిని ఛైర్మన్గా.. మరో 15 మందిని ట్రస్టు బోర్డు సభ్యులుగాను నియమిస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా రెండేళ్ల పాటు ట్రస్టు బాధ్యతల్లో కొనసాగనున్నారు.
అన్నవరం ఆలయానికి నూతన పాలకమండలి - అన్నవరం దేవస్థాన నూతన పాలకమండలి నియామకం
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానానికి కొత్త పాలకమండలిని నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ చట్టం 1987 ప్రకారం 16 మందితో కూడిన మండలిని నియమించింది.
అన్నవరం ఆలయానికి నూతన పాలకమండలి నియామకం