ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆన్‌లైన్‌లో సత్యదేవుని నిత్యకల్యాణం

నేటి నుంచి ఆన్‌లైన్‌లో అన్నవరం సత్యదేవుని నిత్యకల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు పరోక్ష పద్ధతిలో స్వామి నిత్యకల్యాణంలో పాల్గొనేలా ప్రారంభించనున్నారు. యూట్యూబ్ లింక్‌ ద్వారా భక్తులు ఆన్‌లైన్‌లో వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.

annavaram kalyanam  in online
ఆన్‌లైన్‌లో సత్యదేవుని నిత్యకల్యాణం

By

Published : Apr 27, 2021, 9:38 AM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఆన్‌లైన్‌లో సత్యదేవుని నిత్య కల్యాణం నిర్వహించనున్నారు. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌ మంగళవారం ప్రారంభించనున్నారు. భక్తులు పరోక్ష పద్ధతిలో స్వామి నిత్యకల్యాణంలో పాల్గొనేలా శ్రీకారం చుడుతున్నారు. కల్యాణం వీడియో కెమెరాల్లో చిత్రీకరించి యూట్యూబ్‌కు అనుసంధానం చేశారు. యూట్యూబ్‌ లింక్‌ ద్వారా భక్తులు ఆన్‌లైన్​లో వీక్షించే ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా రుసుం చెల్లించే భక్తులకు ముందుగా యూట్యూబ్‌ లింక్‌ పంపిస్తారు. దీని ద్వారా భక్తులు ఆన్‌లైన్​లో వీక్షించవచ్ఛు. ఇలా పరోక్ష పద్ధతిలో స్వామివారి నిత్యకల్యాణంలో పాల్గొనే భక్తులకు స్వామివారి ప్రసాదం, కండువ, రవిక పోస్టల్‌ ద్వారా పంపిస్తారు. దీనికి రూ. 1,116 రుసుం నిర్ణయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఇప్పటికే ఇలా పరోక్ష పద్ధతి ద్వారా ఆన్‌లైన్‌ వ్రతాలను నిర్వహిస్తుండగా నిత్యకల్యాణానికి కూడా ఇదే విధానం ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌ స్వామివారి నిత్యకల్యాణంలో సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురోహితులు కలిసి తమకు వ్రత టికెట్లు ఆదాయంపై ఇచ్చే పారితోషికాన్ని 30 శాతం నుంచి 40 శాతానికి పెంచడానికి ఆమోదం తెలిపాలని కోరారు. ఆమెను ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ మర్యాద పూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో గంటకు 400 మందికి పైగా కరోనా

ABOUT THE AUTHOR

...view details