అన్నవరం దేవస్థానంలో 40మంది ఉద్యోగులు, సిబ్బందికి కరోనా - అన్నవరం వార్తలు
![అన్నవరం దేవస్థానంలో 40మంది ఉద్యోగులు, సిబ్బందికి కరోనా annavaram-breaking](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8344589-589-8344589-1596888294533.jpg)
17:01 August 08
రాష్ట్రంపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా అన్నవరం దేవస్థానంలో 40మంది ఉద్యోగులు, సిబ్బందికి కరోనా సోకింది. ఈ నెల 14 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో త్రినాథరావు ప్రకటించారు.
అన్నవరం దేవస్థానంలో 40మంది ఉద్యోగులు, సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అన్నవరంలో ఈ నెల 14 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో త్రినాథరావు ప్రకటించారు. స్వామివారికి నిత్య ఆర్జిత సేవలు యథాతథంగా కొనసాగుతాయని ఈవో స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించి భక్తులు పూజల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు.
ఇదీ చదవండీ... మొదటి లక్షకు 126 రోజులు... రెండో లక్షకు 11 రోజులు