తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కోమరిపాలెంలో రాజమహేంద్రవరం ఎంపీ మారగాని భరత్, ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డితో కలిసి.. ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. పాడి పరిశ్రమ ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడమే సీఎం జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. పశువులకు వైద్యులు అందించే చికిత్సలను పరిశీలించారు. అనంతరం రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్‌లకు శంకుస్థాపన చేశారు.
పశువుల ఆరోగ్యాన్ని చూసి ఆ రాష్ట్రాభివృద్ధిని అంచనా వేయొచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. అందుకే ప్రతి గ్రామ సచివాలయంలోనూ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్‌ను నియమించామన్నారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో మహిళల ద్వారా పాల కో-ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.