నూతన విద్యా విధానం నిలిపివేయాలని అంగన్వాడీ కార్యకర్తల నిరసన - నూతన విద్యావిధానం నిలపాలని అంగన్వాడీలు
నూతన విద్యా విధానం పట్ల రోడ్డున పడతాం అంటూ ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.
![నూతన విద్యా విధానం నిలిపివేయాలని అంగన్వాడీ కార్యకర్తల నిరసన stop new education policy at mummidivaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9008297-541-9008297-1601559673094.jpg)
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం పట్ల అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రీ ప్రైమరీ పాఠశాలగా మార్చటం వల్ల అంగన్వాడీలు పూర్తిగా మూతపడతాయని..వాటితో ఐదు రకాల సేవలు ప్రజలకు అందకుండా పోతాయన్నారు. ప్రభుత్వం తక్షణం నూతన విద్యా విధానాన్ని నిలిపివేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని హెచ్చరించారు.