ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరసన - రంపచోడవరంలో అంగన్వాడీ కార్యకర్తల నిరసన

తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ.. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవంలో అంగన్వాడీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. పీవోను కలిసి.. వినతిపత్రం అందజేశారు.

anganwadi workers protest at rampachodavarm itda office
రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరసన

By

Published : Mar 22, 2021, 3:41 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన.. అంగన్వాడీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని.. అంగన్వాడి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీ రాణి ఆరోపించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆ ప్రాంతంలో రవాణా పూర్తిగా నిలిచిపోయి.. ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐటీడీఏ కార్యాలయం వద్దకు చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులను అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తేనే ఆందోళన విరమిస్తారమని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. తమపై అధికారుల వేధింపులు పెరిగాయని ఆవేదన చెందారు.

సాంకేతిక జ్ఞానం లేనివారికి ఎలా తెలుస్తుంది?

అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే వారికి చరవాణీలు ఇచ్చి.. గర్భిణులు , బాలింతలు , పిల్లల వివరాలను నమోదు చేయాలని అధికారులు చెబుతున్నారని వారు తెలిపారు. కానీ.. పదోతరగతి చదివిన వారికి సాంకేతిక పరిజ్ఞానం ఎలా వస్తుందని వారు ప్రశ్నించారు.

అడ్డతీగల సీడీపీఓపై చర్యలు తీసుకోవాలి

అడ్డతీగలలో పనిచేస్తున్న సీడీపీఓ.. తమను వేధింపులకు గురి చేస్తుందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించడంలో కూడా జాప్యం వహిస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కారానికి హామీ ఇస్తేనే ఆందోళనలు విరమిస్తానని చెప్పడంతో విషయాన్ని పోలీసులు.. పీవో దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర అధ్యక్షురాలు బేబి రాణితో సహా.. కొందరు అంగన్వాడీ కార్యకర్తలు పీవోను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి:

పోలీసుల పహారాలో ఇళ్ల కూల్చివేత.. ఆందోళనలో స్థానికులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details