అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో అంగన్వాడీ వర్కర్లు ఆందోళనకు దిగారు. అంగన్వాడీ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేసిన వర్కర్లు... పోషణ ట్రాకర్ యాప్ను తొలగించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను.. తమకు వర్తించేలా చేయాలని అభ్యర్థించారు. బకాయిలు చెల్లించాలనీ... ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా అంగన్వాడీ కేంద్రాలను ఒంటి పూట నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని నినాదాలు చేశారు.