తూర్పుగోదావరి జిల్లాలో...
అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వం అందించే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలంటూ... యు.కొత్తపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అంగన్వాడీ సిబ్బందిగా పనిచేస్తున్న తమలో చాలా మందికి ఇళ్లు లేవని తెలిపారు. ఇళ్ల స్థలాల జాబితాలో తమ పేర్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబరు 7 ప్రకారం అర్హులైన సిబ్బందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు.
జీవో నెంబరు 7 ప్రకారం అర్హులైన సిబ్బందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పేదలకు ఇస్తున్నట్లుగానే తమకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.