ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం కేసీఆర్​ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది: పినిపే విశ్వరూప్ - great temple in telagana

AP Minister in Yadadri: యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసిన సీఎం కేసీఆర్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి నరసింహ స్వామి ఆలయాన్ని సతీసమేతంగా దర్శించుకున్న ఆయన..

యాదాద్రి
yadadri

By

Published : Dec 5, 2022, 7:24 PM IST

Pinipe Viswarup to Yadadri: తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లాలో ఉన్న యాదాద్రి నరసింహ స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి ఆలయ సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. సతీసమేతంగా యాదాద్రికు చేరుకున్న మంత్రి.. స్వయంభు నరసింహులును దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.

ప్రపంచమే అబ్బురపడే విధంగా యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా పునర్మించారని పినిపే విశ్వరూప్​ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేసీఆర్​కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అభివర్ణించారు. తనకు ఆరోగ్యం క్షీణించడంతో స్వామివారికి మొక్కి.. ముంబైకి వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్నామన్నారు. మూడు నెలల్లో మరోసారి స్వామి వారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా రానున్నట్లు తెలిపారు.

ఇవి చదవండి

ABOUT THE AUTHOR

...view details