ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిఠాపురం వాసి.. దుబాయ్​లో హతం! - east godavati district

రెండేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. జీతం సరిగా రాకపోవడంపై సంస్థ యాజమాన్యాన్ని నిలదీశాడు. ఆగ్రహించిన యజమాని.. అతడిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన.. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన బాధిత కుటుంబానికి తీరని ఆవేదన మిగిల్చింది.

andhra native disappeared in dubai
andhra native disappeared in dubai

By

Published : Jun 6, 2020, 4:20 PM IST

Updated : Jun 6, 2020, 4:41 PM IST

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. దుబాయ్​లో హతమయ్యాడు. అతడికి ఉద్యోగం ఇచ్చిన సంస్థ యజమానే.. హతమార్చాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన బొర్రా గంగాధర్.. రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లారు. 4 రోజులుగా అతని ఫోన్ స్విచాఫ్ అని వస్తుండగా.. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అతని స్నేహితులకు ఫోన్ చేశారు. గంగాధర్.. రూమ్ కు రావడం లేదని వారు బదులిచ్చారు.

మరింత వాకబు చేయగా... గంగాధర్ ఇక లేడని తెలుసుకున్నారు. జీతం సరిగా ఇవ్వని సంస్థ యాజమాన్యంపై గంగాధర్ ఆగ్రహం వ్యక్తం చేశారని కుటుంబీకులు తెలిపారు. యాజమాన్యానికి చెందిన వ్యక్తే.. గంగాధర్ ను చంపేశారని.. హంతకుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పారు. అతని మృతదేహాన్ని అయినా స్వగ్రామానికి తీసుకురావాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Last Updated : Jun 6, 2020, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details