ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 14, 2020, 8:47 PM IST

ETV Bharat / state

కుప్పకూలిన ఏలేరు కాల్వపై ఉన్న పురాతన వంతెన

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సామర్లకోట రహదారిలో ఏలేరు కాల్వపై పురాతన వంతెన కూలిపోయింది. గ్రావెల్ లోడ్​తో లారీ వెళ్తుండగా వంతెన కూలిపోయింది. ఘటనా స్థలాన్ని మాజీ హోం మంత్రి చినరాజప్ప సందర్శించారు.

కుప్పకూలిన ఏలేరు కాల్వపై ఉన్న పురాతన వంతెన
కుప్పకూలిన ఏలేరు కాల్వపై ఉన్న పురాతన వంతెన

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సామర్లకోట రహదారిలో ఏలేరు కాల్వపై ఉన్న పురాతన వంతెన గత రాత్రి కూలిపోయింది. గ్రావెల్ లోడ్​తో లారీ వెళ్తుండగా వంతెన కూలిపోయింది. కాల్వలో లారీతో సహా పడిపోయిన డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా ఉన్నారు.

కుప్పకూలిన ఏలేరు కాల్వపై ఉన్న పురాతన వంతెన

గత ప్రభుత్వ హయాంలో..

ఘటనా స్థలాన్ని చినరాజప్ప పరిశీలించారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఈ క్రమంలో వంతెన పునర్నిర్మాణానికి రూ.కోటి 50 లక్షల మంజూరు అయ్యింది. ప్రభుత్వ మార్పు వల్ల నిధులు మంజూరు నిలిచిపోయి వంతెన పునర్నిర్మాణ ప్రక్రియ ఆగిపోయిందని మాజీహోంమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు.

కుప్పకూలిన ఏలేరు కాల్వపై ఉన్న పురాతన వంతెన

త్వరితగతిన పూర్తి చేయాలి..

వంతెన నిర్మాణం సామర్లకోట-ఉప్పాడ రహదారి విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.కోటి ముఫ్పై ఐదు లక్షలతో నిర్మించనున్నారు. బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను చినరాజప్ప ఆదేశించారు. ప్రజలకు ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

కుప్పకూలిన ఏలేరు కాల్వపై ఉన్న పురాతన వంతెన

ఇవీ చూడండి : రహదారులు అధ్వానం.. ప్రయాణంలో ఒళ్లు హూనం

ABOUT THE AUTHOR

...view details