తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామి పాదాలకు.. జనసేన నాయకులు పాలాభిషేకం చేశారు. అనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్య ప్రమాణాలు చేయగా.. రాజకీయాలకు ఆలయాలు వేదిక కాదంటూ ఈ కార్యక్రం చేపట్టారు. దేవస్థానాలు ధర్మపరిరక్షణకు ప్రతీకలంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు.
'ఆలయాలు రాజకీయ వేదికలు కాదు.. ధర్మ పరిరక్షణ ప్రతీకలు' - ఆలయంలో సత్యప్రమాణాలు చేయడంపై అనపర్తి జనసేన నేతల ఆందోళన
ఆలయాలు ధర్మపరిరక్షణకు ప్రతీకలని.. రాజకీయ వేదికలు కాదని జనసేన నేతలు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు లక్షీ గణపతి స్వామికి ఆ పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు. అనపర్తి ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు దేవాలయంలో సత్యప్రమాణాలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామి పాదాలకు పాలాభిషేకం