తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గ్రామంలో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి విషయాన్ని దాచిపెట్టడం వలనే కేసులు పెరిగాయని అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. రాజమహేంద్రవరంలో మాట్లాడుతూ... గ్రామంలో ఇప్పటివరకు 5వేల మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. 99 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
'ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది' - తూర్పుగోదావరిలో కరోనా వార్తలు
ప్రజలెవరూ కరోనా వైరస్ గురించి ఆందోళన చెందవద్దని.. ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని... తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అన్నారు. గొల్లల మామిడాడలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ధైర్యం చెప్పారు.
సూర్యనారాయణ రెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే
మామిడాడతో పాటు కొవిడ్ కేసులు నమోదవుతున్న బిక్కవోలు, పెదపూడిలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని.. తగు జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకకుండా ఉంటుందని ధైర్యం చెప్పారు.
ఇవీ చదవండి... మహారాష్ట్ర నుంచి వచ్చిన జిల్లా వాసులు.. క్వారంటైన్‌కు తరలింపు