తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వాలంటీరుకు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రాథమిక చికిత్స చేశారు. అనపర్తిలో వాలంటీరుగా పనిచేస్తున్న సంధ్య అనే యువతి ఆదివారం రాత్రి లక్ష్మీనరసాపురం నుంచి వస్తుండగా ద్విచక్రవాహనం ఢీకొంది. వెనకనే వస్తున్న లారీ ఆమె చేతిపై ఎక్కడంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని అనపర్తి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి ఆమెకు ప్రాథమిక వైద్యం చేశారు. మెరుగైన వైద్యంకోసం జీజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Anaparthi MLA: ఆ వాలంటీర్‌కు వైద్యం అందించిన ఎమ్మెల్యే - అనపర్తి ఎమ్మెల్యే వైద్యం
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వాలంటీరుకు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి వైద్యం అందించారు. అనపర్తిలో వాలంటీరుగా పనిచేస్తున్న సంధ్య అనే యువతి రోడ్డు ప్రమాదంలో గాయపడింది. అనపర్తి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేనందున.. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి ఆమెకు ప్రాథమిక చికిత్స చేశారు.
Anaparthi MLA
అనపర్తి చెందిన సంధ్య వాలంటీరుగా పని చేస్తోంది. పని నిమిత్తం అనపర్తి మండలం లక్ష్మీనరసాపురం నుంచి ద్విచక్రవాహనంపై ఆమె వస్తుంటే మరొక ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె కిందపడగా వెనకనే వస్తున్న లారీ చేతిపై ఎక్కింది. ఆమె చేయిభాగం తీవ్రంగా గాయపడింది.
ఇదీ చదవండి: Amaravati padayatra: కడలి తరంగంలా.. అమరావతి ఉద్యమం