ప్రభుత్వ తీరును మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో మాట్లాడిన ఆయన... గొల్లల మామిడాల గ్రామంలో కరోనా విస్తృతిపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే ఎక్కువ కేసులు నమోదైన గ్రామంగా గొల్లల మామిడాలను నిలబెట్టారని ఆవేదన చెందారు. ప్రభుత్వం ఇందుకుగల కారణాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ అధికారి ముడుపులు తీసుకొని వ్యాపార సంస్థలకు అనుమతులు ఇచ్చారని ఆరోపించారు.
ఈ విషయమై పది రోజులుగా అడుగుతున్నా ఎవరూ స్పందిచండం లేదన్నారు. గతంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తన ఆసుపత్రిని అవసరమైతే కరోనా ఆసుపత్రిగా మారుస్తానన్నారని గుర్తు చేశారు. గొల్లల మామిడాడలో కేసులు పెరుగుతున్నా.. ఎందుకు ఇప్పటివరకూ కరోనా ఆసుపత్రిగా మార్చలేదని ప్రశ్నించారు. పాజిటివ్ కేసుల వాస్తవాలను ప్రభుత్వం దాస్తోందన్నారు. అనపర్తి నియోజకవర్గంలో తెదేపా నాయకులపై 85 అక్రమ కేసులను పెట్టడంలోనే ఎమ్మెల్యే ప్రగతి సాధించారని ఎద్దేవా చేశారు.