తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని వశిష్ట గోదావరినదీపాయపై ఊడిమూడిలంక వద్ద వంతెన నిర్మాణ పరిసరాలను పర్యావరణ నిపుణుల బృందం ఈ రోజు ఉదయం పరిశీలించారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వారికి స్వాగతం పలికారు. ఈ వంతెన నిర్మించేందుకు ఇప్పటికే ఏఐఐబీ(ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకు) ద్వారా రూ.49.50కోట్ల నిధులు మంజూరయ్యాయి. దీనికి రెండో సారి టెండరు పిలిచారు. ఈ ప్రక్రియ పరిశీలనలో ఉంది. ఈ క్రమంలో ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్ డాక్టర్ బీకేడీ.రాజా, ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్ శ్యామరత్నాకర్, సునీతతో కూడిన బృందం ఊడిమూడి పరిసరాలను పరిశీలించింది.
'టెండరు ఖరారైతే డిసెంబరులోగా పనులు ప్రారంభం' - Environmental team observation in Udimudilanka
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని వశిష్ట గోదావరినదీ పాయపై ఊడిమూడిలంక వద్ద వంతెన నిర్మించనున్న ప్రాంతాన్ని పర్యావరణ నిపుణుల బృందం పరిశీలించింది. వీరికి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్వాగతం పలికారు.
ఇక్కడ వంతెన లేకపోవటంతో గోదావరినదికి మధ్యలో ఉన్న ఊడిమూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక, జి పెదపూడిలంక గ్రామాల ప్రజలు గోదావరి వరదల సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే చిట్టిబాబు బృందానికి వివరించారు. గతంలో ఒకసారి టెండరు పిలిచారని టెండర్ అర్హత సాధించకపోవటంతో.. రెండోసారి టెండర్లు పిలిచినట్లు ఆయన తెలిపారు. టెండరు ఖరారైతే డిసెంబరులోగా పనులు మొదలు పెట్టేందుకు వీలుంటుందని ఎమ్మెల్యే చిట్టిబాబు చెప్పారు.
ఇదీ చదవండీ..AP LETTER TO KRMB: కృష్ణా జలాల పంపకాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ