ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 19, 2020, 9:55 AM IST

ETV Bharat / state

ఉప్పాడపై అంపన్ ప్రభావం.. ఎగసిపడుతున్న కెరటాలు

అంపన్ తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ తీరంలో భారీగా కెరటాలు ఎగసిపడుతున్నాయి. కెరటాలు ఎగసిపడి రహదారిపైకి వస్తున్నాయి.

AMPHAN EFFECT ON UPPADA COAST
ఉప్పాడ తీరంపై అంపన్ ప్రభావం.

అంపన్ తుపాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ తీరంపై పడింది. తీరంలోని కెరటాలు భారీగా ఎగిసిపడుతున్నాయి. కెరటాలు వేగం పుంజుకుని తీరాన్ని తాకుతున్నాయి. ఉప్పాడ నుంచి కాకినాడ వరకు ఉన్న బీచ్ రోడ్ లో భారీ కెరటాలు ఎగసి రహదారిపై చొచ్చుకొస్తున్నాయి. రహదారికి రక్షణగా వేసిన రాళ్లు ఎగిరి పడుతున్నాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. కెరటాల తాకిడికి ప్రయాణికులు తడిసి ముద్దవుతున్నారు.

తుపాను ప్రభావిత ప్రాంతాలు అయిన ఉప్పాడ, మాయ పట్నం, సూరాడపేట, కోనపాపపేట తదితర గ్రామాల్లోనూ రాకాసి కెరటాలు గృహాలను తాకుతున్నాయి. కెరటాల తీవ్రతకు కొన్ని గృహాలు ఇప్పటికే నేలకూలాయి. పదుల సంఖ్యలో ఇళ్లలోకి సముద్రపు నీరు చేరుతోంది. తమకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి ఆదుకోవాలని వారంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎప్పుడు తుపాను వచ్చినా ఇదే పరిస్థితి ఉంటుందని ఆవేదన చెందారు.

ABOUT THE AUTHOR

...view details