బంగాళాఖాతంలో ఉమ్ పున్ తుపాను కేంద్రీకృతమై ఉండడంతో.. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ అధికారులు అప్రమత్తమయ్యారు.
తీరంలో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలోని అలలు ఎగిసి పడుతున్నాయని.. ప్రజలెవరూ తీరంలోకి వెళ్లకూడదని సూచించారు.