పెనుతుపాను అంపన్ తూర్పు కోస్తా తీరాన్ని ఆనుకుని అతి వేగంగా కదులుతోంది. గడచిన ఆరు గంటలుగా గంటకు 29 కిలోమీటర్ల వేగంతో ఇది తీరంవైపు దూసుకువస్తోందని ఐఎండీ వెల్లడించింది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్ లోని దిఘాకు 125 కిలోమీటర్ల సమీపంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. పారాదీప్ కు ఈశాన్యంగా ఇది 140 కిలోమీటర్లు, సాగర్ దీవికి 125 కిలోమీటర్ల దూరంలో ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
వేగంగా కదులుతున్న అంపన్ - news on amphan cyclone
గడచిన ఆరు గంటలుగా అంపన్ పెను తుపాను గంటకు 29 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్ లోని దిఘాకు 125 కిలోమీటర్ల సమీపంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ప్రస్తుతం తుపాను కేంద్రకంలో 190 కిలోమీటర్ల వరకూ గాలుల వేగం ఉన్నట్టు వెల్లడించింది. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. పారాదీప్ వద్ద 87 కిలోమీటర్ల, చాంద్ బలీ వద్ద 65 కిలోమీటర్లు, బాలాసోర్ తీరప్రాంతంలో 74 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. తీరాన్ని దాటే సమయంలో పశ్చిమ బంగా- బంగ్లా దేశ్ తీరప్రాంతాలు, సుందర్ బన్స్ వద్ద దాదాపు 4 మీటర్ల మేర ఎత్తున అలలు ఎగసి పడతాయని వాతావరణశాఖ తెలిపింది.
ఇదీ చదవండి : అంపన్ పంజా: తీర ప్రాంతాల్లో అల్లకల్లోలం