బంగాళాఖాతంలో ఏర్పడి పెను తుపానుగా మారిన అంపన్ తుపాను ప్రభావం ఉప్పాడ తీరంపై చూపింది. గత మూడు రోజులుగా సముద్రంలో మార్పులు ఏర్పడి రాకాసి కెరటాలు కలకలం సృష్టిస్తున్నాయి. భారీ ఎత్తులో ఎగిసిపడుతున్న కెరటాలతో తీరప్రాంత గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి పది గంటల నుంచి అలలు తీవ్ర రూపం దాల్చి పదుల సంఖ్యలో ఇళ్లు చెట్లు నేలకూల్చాయి.
అంపన్ ధాటికి వణుకుతున్న ఉప్పాడ - uppada effected by umphan
అంపన్ తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. ఈదురు గాలులకు ఇళ్లు, చెట్లు నేలకొరిగాయి. తీరం కోతకు గరై మరికొన్ని ఇళ్లు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
కెరటాల తాకిడికి తగ్గకపోవడంతో ఇప్పటికే మరికొన్ని ఇళ్లు కోతకు గురై సముద్ర గర్భంలో కలిసి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇల్లు సామగ్రి కోల్పోయిన బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. అకస్మాత్తుగా ఇల్లు కూలిపోవడంతో బాధితుల సామాగ్రి విద్యుత్ ఉపకరణాలు ధ్వంసమయ్యాయి. ఇల్లు కోల్పోయిన బాధితులకు తలదాచుకునే దారిలేక చేజిక్కించుకున్న సామగ్రితో నడిరోడ్డుపై బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. రాత్రికి రాత్రే సుమారు 30 మీటర్ల దూరం సముద్రం ముందుకు రావడంతో తీరప్రాంత వాసులు భయాందోళనలు చెందుతున్నారు.
ఇదీ చదవండి:కోనసీమపై అంపన్ ప్రభావం.. పునరావాస కేంద్రాలు సిద్ధం