అంపన్ తుపాన్ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో పలు గృహాలు నేల కూలాయి. తీర ప్రాంతంలోని కోనపాపపేట, ఉప్పాడ, సోరాడపేట, జగ్గరాజుపేట, మాయాపట్నం తదితర గ్రామాల్లో రాకాసి కెరటాలు విరుచుకుపడ్డాయి. కొన్ని గృహాలు సముద్ర గర్భంలో కలిసిపోగా, యాభైకి పైగా కుటుంబాలు సామగ్రితో రోడ్డున పడ్డాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి దయనీయంగా మారింది. వీరు ఉండేందుకు ఎవరు ఇళ్లులు అద్దెకి ఇవ్వకపోవడం వల్ల వేరే దారి లేక చెట్ల కింద, శిథిల ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు. గృహాలు కోల్పోయి మూడు రోజులుగా తిండి, నిద్ర లేకుండా ఇబ్బందులు పడుతున్నప్పటికీ తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంపన్ ఎఫెక్ట్.. నిరాశ్రయులైన మత్స్యకారులు - నిరాశ్రయులైన మత్స్యకారుల వార్తలు
అంపన్ తుపాన్ తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర ప్రభావం చూపింది. తీరం దాటే సమయంలో రాకాసి అలలు విరుచుకుపడటంతో సముద్ర తీరం కోతకు గురై మత్స్య కారుల గృహాలను తనలో కలిపేసుకుంది. దీంతో మూడు రోజలుగా గంగా పుత్రులు చెట్ల కిందే జీవిస్తున్నారు.
అంఫాన్ ఎఫెక్ట్ నిరాశ్రయులైన మత్స్యకారులు