ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడిపందేల ట్రాఫిక్​ జాం.. ఇరుక్కుపోయిన అంబులెన్స్​ - పేరవరం వద్ద కోడిపందేలు

సంక్రాంతి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. కోడి పందేలు చూసేందుకు జనాలు భారీ సంఖ్యలో రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా ట్రాఫిక్​ జాం ఏర్పడింది. దీంతో గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి దగ్గరకు చేరేందుకు అంబులెన్స్​కు ఏకంగా మూడు గంటల సమయం పట్టింది. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో పేరవరంలో చోటుచేసుకుంది.

ambulance strucked in traffic
ట్రాఫిక్​లో ఇరుక్కుపోయిన అంబులెన్స్​

By

Published : Jan 13, 2021, 6:55 PM IST

Updated : Jan 13, 2021, 7:40 PM IST

కోడి పందేల కారణంగా కారణంగా భారీ ట్రాఫిక్ జాంతో ఓ అంబులెన్స్​ ఇరుక్కుపోయిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో పేరవరంలో చోటుచేసుకుంది. రాజమహేంద్రవరానికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఆత్రేయపురం మండలంలోని బొబ్బర్లంక సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో వెంకట్రావు కాలు విరిగింది. గమనించిన స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. పేరవరం వద్ద కోడిపందేలు జరుగుతుండటంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో అంబులెన్స్​ ట్రాఫిక్​లో చిక్కుకుపోయింది. ముందుకు వెళ్లలేక.. వెనక్కి పోలేకా మూడు గంటల సేపు ట్రాఫిక్​లోనే ఇరుక్కుపోయింది. పోలీసు సిబ్బంది ఎవరూ లేకపోవండంతోనే ట్రాఫిక్​ జాం ఏర్పడిందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.

ట్రాఫిక్​లో ఇరుక్కుపోయిన అంబులెన్స్​
Last Updated : Jan 13, 2021, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details