ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమలాపురం జిల్లా అయితే.. అంబేడ్కర్ పేరు పెట్టేలా కృషి చేస్తా: ఎంపీ అనురాధ - అమలాపురంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లాలో అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Ambedkar's 130th birth anniversary
ఘనంగా అంబేడ్కర్ జయంతి

By

Published : Apr 14, 2021, 6:56 PM IST

Updated : Apr 14, 2021, 7:47 PM IST

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు సందర్భంగా అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింతా అనురాధ నివాళులు అర్పించారు. పి.గన్నవరంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల్లో అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి అంబేడ్కర్ జిల్లాగా నామకరణం చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ అనురాధ వెల్లడించారు.

రాజమహేంద్రవరంలో జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలు నిర్వహించారు. వైకాపా యువ నేత జక్కంపూడి గణేష్.. నగరంలో 33 దళిత వాడల్లో చలివేంద్రాలు ప్రారంభించారు. విశ్వజ్ఞాని భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని గణేష్ పేర్కొన్నారు. గోకవరం బస్ స్టాండ్ వద్ద గల డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కంబాల చెరువు వద్ద గల మాజీ మంత్రి దివంగత శ్రీ జక్కంపూడి రామోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని తెదేపా అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు కొనియాడారు. అంబేడ్కర్ 130 వ జయంతిని పురస్కరించుకుని.. కొత్తపేటలో ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి అనంత కుమారి, బండారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఇవీ చూడండి:

తాటిపాక కూడలిలో పది దుకాణాలలో వరుస చోరీలు

Last Updated : Apr 14, 2021, 7:47 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details