ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాం అంబేడ్కర్ విజ్ఞాన భవన్ ప్రారంభానికి సిద్ధం - అంబేద్కర్ విజ్ఞాన భవన్ ప్రారంభం

కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో అంబేడ్కర్ విజ్ఞాన భవన్.. ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. విద్యార్థుల సౌకర్యార్థం నిర్మించిన ఈ భవనాన్ని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి బుధవారం ప్రారంభించనున్నారు.

yanam ambedkar vignan bhavan
యానాం అంబేద్కర్ విజ్ఞాన భవన్

By

Published : Jan 5, 2021, 5:32 PM IST

కేంద్ర పాలిత యానాంలో అంబేడ్కర్ విజ్ఞాన భవన్.. ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి బుధవారం ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. విద్యార్థులకు కావలసిన అన్ని సదుపాయాలతో నిర్మాణపనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో కొలువులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇందులో చేశారు.

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఐదు కోట్ల వ్యయంతో విజ్ఞాన భవన్​ నిర్మించారు. అంబేద్కర్ 125 వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం భవనాన్ని నిర్మించింది. సాధారణ పోటీ పరీక్షల నుండి సివిల్ సర్వీసెస్​కు సిద్ధమయ్యే వారందరికీ.. ఈ విజ్ఞాన భాండాగారం ఎంతగానో ఉపకరిస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి బళ్లారి కృష్ణారావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details