తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అంబేడ్కర్ 129వ జయంతి నిర్వహించారు. రాష్ట్ర శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రమణ్యం ఇంటి వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కొత్తపేట పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వాడపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇంటివద్దనే అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు అంబేడ్కర్కి అంజలి ఘటించారు.
కొత్తపేటలో అంబేడ్కర్ జయంతి - Ambedkar Jayanti celebrations
డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ 129వ జయంతి వేడుకలు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో నిరాడంబరంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

కొత్తపేటలో అంబేడ్కర్ జయంతి వేడుకలు