తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించారు. అమరావతి రాజధాని కొనసాగించాలని జాతీయ రహదారి వద్ద ఉన్న డీసీఎంఎస్ మాజీ అధ్యక్షుడు కెవి సత్యనారాయణ రెడ్డి ఇంటి నుంచి రావులపాలెం పలు ప్రాంతాల్లో ఈ పాదయాత్ర కొనసాగింది. స్వప్రయోజనాల కోసమే రాజధానిని తరలిస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప విమర్శించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఐకాస నాయకులు, జిల్లాలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తెదేపా నాయకులు, కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
'స్వప్రయోజనాల కోసమే రాజధాని తరలింపు' - రావులపాలెంలో రాజధాని కోసం మహా పాదయాత్ర తాజా వార్తలు
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో మహా పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రంలోని ఐకాస నాయకులు, జిల్లాలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహా పాదయాత్ర