ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు' - news updates in vizag steel plant

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి మద్దతు తెలిపేందుకు అమరావతి ప్రాంత రైతులు విశాఖపట్నంకు బయల్దేరారు. మార్గమధ్యంలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

amaravathi farmers fire on state government about vizag steel plant privatization
అమరావతి ప్రాంత రైతులు

By

Published : Feb 16, 2021, 1:21 AM IST

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్​ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న వారికి మద్దతు తెలిపేందుకు అమరావతి నుంచి విశాఖ వెళ్తున్న రైతులు తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల అమరావతి ప్రాంతంలోని రైతులు వీర మరణం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నెపంతో కేంద్రంతో కలిసి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details