ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

dussehra celebrations: అమలాపురంలో విజయదశమి ఉత్సవాలు... ఆకట్టుకున్న ప్రదర్శనలు - amalapuram latest news

అమలాపురంలో విజయదశమి ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. 7 ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలు.. ప్రత్యేక వేషాధారణలతో అద్భుతంగా సాగాయి. మహారాష్ట్రకు చెందిన డప్పు కళాకారుల ప్రదర్శన అబ్బురపరిచింది.

dussehra  celebrations
dussehra celebrations

By

Published : Oct 17, 2021, 4:58 AM IST

తూర్పుగోదావరి జిల్లా(east godavari district) అమలాపురం(Amalapuram)లో విజయదశమి సందర్భంగా చేపట్టిన ప్రదర్శనలు ఔరా (dussehra celebrations) అనిపించాయి. 7 ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలు.. ప్రత్యేక వేషాధారణలతో అద్భుతంగా సాగాయి. అగ్గి బరాటాలు, భక్తుల కర్రల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మహారాష్ట్రకు చెందిన డప్పు కళాకారుల ప్రదర్శన అబ్బురపరిచింది. కొవిడ్ నిబంధనల దృష్ట్యా వీధుల్లోనే ప్రదర్శన నిర్వహించారు. శ్రీ దేవి అమ్మవారు కొలుస్తూ చేసిన ఆయుధ ప్రదర్శనలు వీక్షకులను కట్టిపడేశాయి. ఈ ప్రదర్శనలని చూడడానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.

అమలాపురంలో విజయదశమి ఉత్సవాలు... ఆకట్టుకున్న ప్రదర్శనలు
ఇదీ చదవండి

dussehra : వైభవంగా దసరా వేడుకలు... ఆలయాల్లో భక్తుల రద్దీ

ABOUT THE AUTHOR

...view details