ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సమగ్ర పరిశీలన తర్వాతే ఇసుక ర్యాంపులకు అనుమతులు' - Amalapuram sub collector latest news

వివిధ శాఖల నుంచి సమగ్ర పరిశీలన నివేదిక అందిన అనంతరం ఇసుక ర్యాంపుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ స్పష్టం చేశారు. సాధ్యాసాధ్యాలను బట్టి ర్యాంపులను తెరిచేందుకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Amalapuram sub collector visit Sand Reaches
Amalapuram sub collector visit Sand Reaches

By

Published : Nov 18, 2020, 11:12 PM IST

వివిధ శాఖల నుంచి సమగ్ర పరిశీలన నివేదిక అందిన అనంతరం ఇసుక ర్యాంపుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో రాజోలులో 2, శివకోటిలో 1, సోంపల్లిలో 1 చొప్పున ఇసుక ర్యాంపులకు అనుమతుల కోసం వివిధ బోట్స్ మ్యాన్ సొసైటీల దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ ఆయా ర్యాంకులను పరిశీలించారు. రెవెన్యూ, గనులు, భూగర్భ జల, హెడ్ వర్క్స్ శాఖల నుంచి నివేదికలు వచ్చిన అనంతరం సాధ్యాసాధ్యాలను బట్టి ర్యాంపులను తెరిచేందుకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details