కొత్త జిల్లా ఏర్పాటుపై అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భవనాలు, స్థలాలు తదితర సమగ్ర సమాచారాన్ని నివేదిక రూపంలో పంపాలని ఆదేశించారు.
రెవెన్యూ శాఖ సేకరించిన సమాచారం మేరకు మొత్తం 36 శాఖలకు సంబంధించి 24 శాఖల సమాచారం తమ వద్ద ఉందని సబ్ కలెక్టర్ వెల్లడించారు.