బస్సులు సిద్ధం చేస్తున్న అమలాపురం డిపో అధికారులు - latest rtc bus services in amalapuram
కరోనా వ్యాప్తి చెందకుండా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపోలో వివిధ సర్వీసు బస్సుల్లో సీట్లను సిద్ధం చేస్తున్నారు.

బస్సులు సిద్ధం చేస్తున్న అమలాపురం డిపో మేనేజర్
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపోలోని బస్సులలో సీటింగ్ విధానంలో మార్పులు చేస్తున్నారు. పక్కపక్కన కూర్చోకుండా సీట్లపైన ఎరుపురంగుతో ఇంటూ మార్క్ వేస్తున్నారు. భౌతికదూరాన్ని పాటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సూపర్ లగ్జరీ సర్వీస్‌లో 36 సీట్లకుగాను 27 సీట్లు, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులో 50కిగాను 30 సీట్లను కేటాయిస్తూ బస్సులను సిద్ధం చేస్తున్నామని... అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ టీవీఎస్ సుధాకర్ వెల్లడించారు.