ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎక్సైజ్ మహిళా ఎస్సైపై దురుసు ప్రవర్తన.. వైకాపా కౌన్సిలర్​పై కేసు

By

Published : Apr 9, 2021, 11:05 AM IST

అక్రమ మద్యం కేసుకు సంబంధించి ఎక్సైజ్ అధికారి ఫిర్యాదుపై తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పోలీసులు వైకాపాకు చెందిన కౌన్సిలర్​పై కేసు నమోదు చేశారు. తెలంగాణ నుంచి మద్యం అక్రమంగా రవాణా చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకోవడంతో.. వారితో దురుసుగా ప్రవర్తించాడు.

Amalapuram police have registered a case against  ysrcp councilor following a complaint by an excise officer
మద్యం పట్టుకున్న పోలీసులు

ఎక్సైజ్ ఎస్సై అయినా మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన వైకాపాకు చెందిన కౌన్సిలర్​పై తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పోలీసులు కేసునమోదు చేశారు. అమలాపురానికి చెందిన కోడూరు సత్యదుర్గాప్రసాద్ తెలంగాణ నుంచి 560 మద్యం సీసాలను.. ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా రప్పించాడు. అమలాపురానికి వచ్చిన ఆ మద్యం సీసాలను దుర్గాప్రసాద్ జీపులలో తీసుకెళ్తుండగా.. ఎక్సైజ్ అధికారులకు తనిఖీలు నిర్వహించారు. దుర్గాప్రసాద్​తో పాటు జీపుని, మద్యం సీసాలను వారు స్టేషన్​కి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానిక వైకాపాకు చెందిన కౌన్సిలర్ దొమ్మేటి రాము.. ఎక్సైజ్ ఎస్సై విజయలక్ష్మి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఆమె ఫిర్యాదు మేరకు కౌన్సిలర్ మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details