ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమలాపురం కిమ్స్ కొవిడ్‌ ఆస్పత్రిలో మృతదేహాలు తారుమారు

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కిమ్స్ కొవిడ్‌ ఆస్పత్రిలో మృతదేహాలు తారుమారు కలకలం రేపింది. అంత్యక్రియలు నిర్వహించిన తరువాత తారుమారును గమనించిన మృతుడి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు.

corona patients dead bodies changed
అమలాపురం కిమ్స్ కొవిడ్‌ ఆస్పత్రిలో మతదేహాలు తారుమారు

By

Published : Jun 7, 2021, 10:00 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కిమ్స్ కొవిడ్‌ ఆస్పత్రిలో మృతదేహాలు తారుమారయ్యాయి. కరోనాతో మరణించిన వ్యక్తికి బదులుగా మరో మృతదేహాన్ని అప్పగించారు.

కరోనాతో పి.గన్నవరం మండలం మొండెపులంకకు చెందిన దుర్గారావు, రాజోలు మండలం కడలి చెందిన విజయ్‌కుమార్​లు ఒకే ఆసుపత్రిలో మరణించారు. దుర్గారావు కుటుంబసభ్యులకు విజయకుమార్ మృతదేహాన్ని అప్పగించారు. విషయం తెలియని దుర్గారావు బంధువులు విజయకుమార్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. విజయ్‌ మృతదేహం అప్పగించాలంటూ ఆస్పత్రి వద్ద అతని బంధువుల అందోళనకు దిగారు.

ABOUT THE AUTHOR

...view details