తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని పేరమ్మ అగ్రహారంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో చోరీ జరిగింది. రెండ్రోజుల క్రితం ఏటీఎంలో రూ.23 లక్షలు నగదు ఉంచినట్లు సమాచారం. దుండగులు గ్యాస్ కట్టర్లతో ఏటీఎంని కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. అమలాపురం సీఐ బాజీలాల్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎంత నగదు చోరీ జరిగిందో పరిశీలించాల్సి ఉందని సీఐ తెలిపారు.
అమలాపురం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో భారీ చోరీ! - తూర్పుగోదావరి జిల్లా క్రైమ్ న్యూస్
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పేరమ్మ అగ్రహారంలోని ఏటీఎంలో చోరీ జరిగింది. ఏటీఎంను బద్దలు కొట్టి దుండగులు నగదు ఎత్తుకెళ్లారు. రెండ్రోజుల క్రితం ఏటీఎంలో రూ.23 లక్షలు ఉంచినట్లు సమాచారం.
atm robbery