కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని గురువారం అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆశీర్వచనం ఇచ్చి, తీర్థప్రసాదాలు అందజేశారు. దేవస్థానం చైర్మన్ రమేష్‌రాజు స్వామివారి జ్ఞాపిక అందించారు.
వాడపల్లి వెంకన్న సన్నిధిలో సబ్ కలెక్టర్ - వాడపల్లి తాజా వార్తలు
వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని అమలాపురం సబ్ కలెక్టర్ కౌశిక్.. కుటుంబ సభ్యులతో కలిసి దర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ వారు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అమలాపురం సబ్ కలెక్టర్ కౌశిక్