ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహాశివరాత్రి సందర్భంగా వీరభద్రునికి అలుగుల సంబరం - Alugula Sambaram for Veerabhadraswamy news

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం ఇమ్మిడివరప్పాడు, రంగాపురంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. వీరభద్ర స్వామిని కొలుస్తూ.. భక్తులు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.

Alugula Sambaram for Veerabhadraswamy
వీరభద్రునికి అలుగుల సంబరం

By

Published : Mar 12, 2021, 1:44 PM IST

మహాశివరాత్రి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం ఇమ్మిడివరప్పాడు, రంగాపురం గ్రామాల్లో వీరభద్రుని కొలిచారు. ఇందులో భాగంగా అలుగుల సంబరం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు త్రిశూల ఆకారంతో ఉన్న అలుగులను ముఖం, కంఠం భాగంలో గుచ్చుకుని ట్రాక్టర్​లపై ఊరేగారు. శరభ శరభ అంటూ వీరభద్రుని స్మరణలతో ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

ABOUT THE AUTHOR

...view details