ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అర్హతే లక్ష్యంగా ప్రభుత్వ పథకాల అమలు' - Allotment of plots by lottery news

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపును మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. అర్హతే లక్ష్యంగా సీఎం జగన్ ప్రభుత్వ పథకాలు అమల చేస్తున్నారని ఆయన అన్నారు.

Allotment of plots by lottery  by Minister Pnipe Vishwaroop in Kakinada, East Godavari district
కాకినాడలో లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపును ప్రారంభించిన మంత్రి పినిపే విశ్వరూప్

By

Published : Jul 3, 2020, 7:54 PM IST

ముఖ్యమంత్రి జగన్ అర్హతే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఈనెల 8న ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లాటరీద్వారా ప్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు టోకెన్లు అందించారు. కాకినాడ నగరంలో 32వేల మందికి ఇంటిపట్టాలు ఇస్తుండటం సామాన్య విషయం కాదని విశ్వరూప్‌ అన్నారు. గత ప్రభుత్వం పథకాలను ప్రచారానికి వాడుకుంటే... వైకాపా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులకే పథకాలు అందజేస్తోందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details