ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. అమలాపురం డివిజన్లో 2479 ఓటర్లు ఉన్నారని సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ తెలిపారు. ఆదివారం జరిగే పోలింగ్ నిమిత్తం అమలాపురం డివిజన్లో 16 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని.. 90 మందిని పోలింగ్ సిబ్బంది నియమించామని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో.. ఎన్నికల మెటీరియల్ పంపిణీని ఆయన పరిశీలించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు.. అధికారులు తెలిపారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి - mlc elections news
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు అధికారులు తెలిపారు. తూర్పుగోదావరిలోని అమలాపురంలో ఎన్నికల ఏర్పాట్లను.. జిల్లా సంయుక్త పాలనాధికారి హిమాన్షు కౌశిక్ పరిశీలించారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి